close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120072778 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => PMYGtaUApdk [video_short_link] => PMYGtaUApdk [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-06-06 19:33:13.290173 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 06/06/2020 19:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమర్‌నాథ్‌ యాత్ర ఈ సారి 14రోజులే

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్‌ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన అమర్‌నాథ్‌ యాత్ర జులై 21న ప్రారంభం కానుంది. ఈ సారి  కేవలం  14 రోజుల పాటు మాత్రమే ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 3తో ముగియనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి శుక్రవారం ప్రథమ పూజ నిర్వహించారు.

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లదలిచిన వారు ఈ సారి కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాటరీ విధానంలో టికెట్లను ఎంపిక చేస్తారు. కేవలం 4 నుంచి 5 వేల మంది యాత్రికులను మాత్రమే ఎంపిక చేయనున్నారు. 55 ఏళ్లు పైబడిన వారికి యాత్రకు అనుమతించరు. సాధువులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అలాగే యాత్రికులకు కొవిడ్‌-19 పరీక్షలు చేస్తారు. లక్షణాలు లేనివారికి మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. తొలిసారిగా ఉదయం, సాయంత్రం లైవ్‌ హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు తెలిపింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.