
తాజా వార్తలు
పరిశ్రమల్ని తరలించాలని చూస్తే ఊరుకోం: ఠాక్రే
ముంబయి: మహారాష్ట్ర నుంచి ఎవరైనా పరిశ్రమల్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే అనుమతించేది లేదని సీఎం ఉద్ధవ్‌ఠాక్రే తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ముంబయి పర్యటనలో భాగంగా పలువురు వాణిజ్యవేత్తలు, సినీ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..‘ఒకరు అభివృద్ధి చెందుతుంటే మహారాష్ట్రవాసులు ఎప్పుడు అసూయగా భావించరు. అదేవిధంగా ఏదైనా రంగంలో పోటీ ఇచ్చినా మాకు ఏం సమస్య లేదు. కానీ బలవంతంగా మా నుంచి ఏదైనా తీసుకెళ్లిపోతామంటే మాత్రం ఉపేక్షించేది లేదు. అటువంటి చర్యలను ఏమాత్రం సాగనివ్వను. మీరు(వాణిజ్యవేత్తలు) కూడా అలా వెళ్లరు. పెట్టుబడిదారులకు మహారాష్ట్ర స్వర్గధామంగా ఉంటుంది’ అని ఠాక్రే పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సచిన్ సావంత్ ఇటీవల మాట్లాడుతూ.. హిందీ చిత్రపరిశ్రమ ‘బాలీవుడ్’ను ముంబయి నుంచి తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేసిన క్రమంలో ఠాక్రే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
