యూకే, దక్షిణాఫ్రికా.. ఇప్పుడు నైజీరియాలో 

తాజా వార్తలు

Published : 24/12/2020 18:26 IST

యూకే, దక్షిణాఫ్రికా.. ఇప్పుడు నైజీరియాలో 

ఆఫ్రికా దేశంలో పుట్టుకొచ్చిన మరో కొత్తరకం కరోనా 

అబుజా: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి తాజాగా మరోసారి తన వేషం మార్చుకుంది. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో కొత్త రకం కేసులు బయటపడగా.. తాజాగా ఆఫ్రికా దేశమైన నైజీరియాలో మరో రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. ఈ మేరకు అక్కడి ఉన్నత స్థాయి ఆరోగ్య అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. అయితే దీనిపై లోతైన పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు. 

‘కరోనాలో మరో కొత్తరకాన్ని గుర్తించాం. ఇది యూకే, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన దానికంటే భిన్నమైనది. దీని గురించి స్పష్టమైన సమాచారం ఇప్పుడే చెప్పలేం’ అని ఆఫ్రికా సెంటర్స్ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ హెడ్‌ జాన్‌ కెంగాసాంగ్‌ వెల్లడించారు. నైజీరియాలోని ఓసున్‌ రాష్ట్రంలో ఇద్దరు కరోనా రోగుల నుంచి ఈ ఏడాది ఆగస్టు 3, అక్టోబరు 9 తేదీల్లో సేకరించిన నమూనాల్లో వైరస్‌ జన్యుమార్పిడిని గుర్తించినట్లు తెలిపారు. 

ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో జన్యుమార్పిడి వైరస్‌ కేసులు బయటపడిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్‌ 70శాతం వేగంగా వ్యాపించే అవకాశమున్నట్లు వార్తలు రావడంతో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే భారత్‌ సహా అనేక దేశాలు యూకేకు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి లండన్‌ వచ్చిన ఇద్దరిలో ఇంకో రకం వైరస్‌ బయటపడింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన వైరస్‌ను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్‌కు ఉన్నాయని, ఉత్పరివర్తనం కూడా త్వరత్వరగా జరుగుతుందని బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇవీ చదవండి..

యూకే కొత్తరకం.. మరిన్ని దేశాల్లో

కరోనా: ఆ దేశ ప్రధానిపై రూ. 900కోట్ల దావా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని