యూపీలో అమానవీయ ఘటన
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 06:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో అమానవీయ ఘటన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈటాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వృద్ధ ఖైదీని మంచానికి గొలుసులతో కట్టేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ఈటా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 92 ఏళ్ల వృద్ధుడికి సాధారాణ శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో కారాగార ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అలీఘర్‌ ఆస్పత్రికి సిఫార్సు చేయగా అక్కడ పడకలు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఈటా జైలు ఆస్పత్రికే తీసుకొచ్చారు. అక్కడ సిబ్బంది వృద్ధ ఖైదీని కాళ్లను గొలుసులతో బంధించి మంచానికి కట్టేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో అక్కడి జైళ్లశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈటా జైలు వార్డెన్‌ అశోక్‌ యాదవ్‌ను సస్పెండ్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని