China: చైనాలో జోరుగా టీకా పంపిణీ.. అవసరమైనవారికి బూస్టర్‌ డోసు

తాజా వార్తలు

Published : 24/10/2021 23:26 IST

China: చైనాలో జోరుగా టీకా పంపిణీ.. అవసరమైనవారికి బూస్టర్‌ డోసు

బీజింగ్‌: తమ దేశంలో దాదాపు 76 శాతం జనాభాకు పూర్తిస్థాయిలో కరోనా టీకా డోసులు వేసినట్లు చైనా ప్రకటించింది. 141 కోట్ల జనాభాలో 106 కోట్ల మంది కొవిడ్‌ టీకాలు వేసుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 224 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్  ఆదివారం వెల్లడించింది. ఆరు నెలల క్రితం చివరి డోసు తీసుకున్న వయోజనులకు బూస్టర్ డోసును కూడా వేస్తున్నట్లు పేర్కొంది. బూస్టర్ డోసు కోసం వృద్ధులు, బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

చైనా టీకాలు సినోవాక్, సినోఫార్మ్ తీసుకున్న తర్వాత ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు కొన్ని నెలలు మాత్రమే ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో అవసరమైన వారికి బూస్టర్ డోసులను కూడా చైనా ఇస్తోంది. ప్రస్తుతం రష్యా, బ్రిటన్‌లో వణుకు పుట్టిస్తున్న కరోనా.. పుట్టినిల్లు చైనాలోనూ వైరస్‌ తీవ్రత కొనసాగిస్తోంది. పలు నగరాలు, పట్టణాల్లో మళ్లీ వ్యాపిస్తోంది. ఒక్క కేసు నమోదైనా ఉలిక్కిపడుతోన్న చైనా.. తాజాగా పలు నగరాల్లో వైరస్‌ విజృంభణ మొదలు కావడంతో అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా పాఠశాలలు మూసివేయడం, వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో పాటు భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం ప్రారంభించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని