ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురి మృతి!

తాజా వార్తలు

Updated : 18/04/2021 13:26 IST

ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురి మృతి!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. షాదోల్‌ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ప్రాణవాయువు‌ కొరతతో ఆరుగురు రోగులు మృతిచెందినట్లు సమాచారం. ఆక్సిజన్‌ లేకనే వారు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. కరోనాతోనే వారు మృతిచెందారని యాజమాన్యం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 11,269 కరోనా కేసులు నమోదయ్యాయి. 66 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు 4,491 మంది మరణించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని