close

తాజా వార్తలు

Updated : 21/04/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బైకుల్లా జైల్లో కొవిడ్‌ విజృంభణ 

 ఇంద్రాణీ ముఖర్జీయాకి పాజిటివ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్రలో కొవిడ్‌ జైళ్లలో కూడా తీవ్రంగా వ్యాపిస్తోంది. తాజాగా ముంబయిలోని బైకుల్లా కారాగారంలో పదుల సంఖ్యలో ఖైదీలు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో షీనాబోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణీ ముఖర్జీయా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ధ్రువీకరించారు. ఈ రాష్ట్రంలో తాజాగా జైళ్లు, వృద్ధాశ్రమాల్లో కరోనా ప్రబలుతోంది. అంతకుముందే పారమ్‌ శాంతిధామ్‌ వృద్ధాశ్రమంలో 58 మంది కొవిడ్‌ బారిన పడినట్లు తేలింది. 

2015లో సంచలనం సృష్టించిన షీనా బోరా కేసులో ఇంద్రాణీ  విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పీటర్‌ ముఖర్జీయా, సంజీవ్‌ ఖన్నాలు సహనిందితులుగా ఉన్నారు. షీనాబోరాను 2012లో హత్య చేయగా.. ఆ విషయం మూడేళ్ల తర్వాత బయటపడింది.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కరోనా కేసులు నమోదుఅయ్యాయి. 52,412 మంది కొవిడ్‌ నుంచి కోలుకొన్నారు. 351 మంది మృత్యువాత పడ్డారు. ఈ రాష్ట్రంలో మొత్తం కేసులు 39లక్షలకు సమీపంలో ఉన్నాయి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని