బెంగాల్‌: ‘గోలీమారో’ వ్యాఖ్యలు.. ముగ్గురి అరెస్ట్‌

తాజా వార్తలు

Published : 21/01/2021 20:37 IST

బెంగాల్‌: ‘గోలీమారో’ వ్యాఖ్యలు.. ముగ్గురి అరెస్ట్‌

కోల్‌కతా: ‘గోలీమారో..’ (దేశద్రోహులను కాల్చండి) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు భాజపా కార్యకర్తలను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హుగ్లీ జిల్లాలో బుధవారం జరిగిన ఆ పార్టీ నేత సువేందు అధికారి రోడ్‌ షోలో ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ సుమోటోగా కేసు నమోదు చేసి నిన్న రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.

ఇందులో హుగ్లీ జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సురేష్‌ షా ఉన్నారు. వీరిని స్థానిక న్యాయస్థానంలో హాజరు పర్చగా జనవరి 30 వరకు రిమాండ్‌ విధించింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న ముగ్గురినీ వెంటనే విడుదల చేయాలంటూ భాజపాకు చెందిన కార్యకర్తలు పోలీస్‌ కమిషనరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఏమాత్రం సహించబోమని భాజపా అధికార ప్రతినిధి సమిక్‌ భట్టాచార్య అన్నారు. గతేడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘గోలీమారో’ వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
టీకా వేయించుకోనున్న ప్రధాని మోదీ!
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని