అమెరికా 2020: 120ఏళ్లలోనే అత్యధిక ఓటింగ్‌

తాజా వార్తలు

Updated : 06/11/2020 16:20 IST

అమెరికా 2020: 120ఏళ్లలోనే అత్యధిక ఓటింగ్‌

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశ చరిత్రలోనే అత్యధిక ఓట్లు పొందిన అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌ అరుదైన ఘనత సొంతం చేసుకోగా.. అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైన ఎన్నికలు కూడా ఇవే కావడం మరో రికార్డు. 120ఏళ్లలోనే ఈసారి అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైనట్లు యూఎస్‌ ఎలక్షన్‌ ప్రాజెక్ట్‌ వెల్లడించింది.

యూఎస్‌ ఎలక్షన్‌ ప్రాజెక్ట్‌ ప్రాథమిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది అమెరికాలో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా.. తాజా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు 66.9శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్‌ ప్రక్రియ, లెక్కింపు కొనసాగుతున్నందున ఓటింగ్‌ శాతం మరింత పెరగొచ్చని యూఎస్‌ ఎలక్షన్ ప్రాజెక్ట్‌ తెలిపింది. కాగా.. 120ఏళ్ల తర్వాత అమెరికాలో అత్యధిక పోలింగ్‌ నమోదైన ఎన్నికలు ఇవే. చివరిసారిగా 1900లో అత్యధికంగా 73.7శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఈ సంస్థ పేర్కొంది. 2016 ఎన్నికల్లో 56శాతం పోలింగ్ నమోదవగా.. 2008లో ఓటింగ్‌ 58శాతంగా ఉంది.

ఈ ఏడాది మిన్నెసొటా, మైన్‌లో అత్యధికంగా 79.2శాతం పోలింగ్‌ నమోదైంది. ఐయోవా(78.6శాతం), కొలరాడో(77.1శాతం),మిషిగన్‌(73.5శాతం),మసాచుసెట్స్‌(73.4శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కనెక్టికట్‌, డెలావేర్‌, ఫ్లోరిడా, మేరీలాండ్‌, మోంటానాల్లోనూ 70శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. అత్యల్పంగా ఆర్కాన్సాస్‌లో 56.1శాతం ఓట్లు పోలయ్యాయి. 

అన్నింటా అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా.. ఓటింగ్‌ విషయానికొస్తే మాత్రం ప్రపంచంలోనే అత్యంత తక్కువ పోలింగ్‌ శాతం నమోదయ్యే దేశాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తోంది. ప్యూ రీసర్చ్‌ ర్యాంకింగ్‌ గణాంకాల ప్రకారం.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరిగిన ఎన్నికలను చూస్తే పోలింగ్‌ శాతంలో అమెరికా అట్టడుగున ఉంది. ఎన్నికల్లో జాతీయ స్థాయి నిబంధనలు లేకపోవడం, ఎన్నికల రోజున సెలవు ప్రకటించకపోవడం, కొన్ని వర్గాల వారు ఓటేయకుండా ఉన్న అడ్డంకులు తదితర కారణాల వల్ల అమెరికాలో ఓటింగ్‌ శాతం అంతంతమాత్రంగానే ఉంటోంది. అయితే గతంలో పోలిస్తే ఈ సారి ఓటింగ్‌ శాతం మెరుగవడం కాస్త సానుకూలాంశమని టైమ్స్‌ మ్యాగజైన్‌‌ పేర్కొంది. 

ఇదీ చదవండి..

బైడెన్‌ ఖాతాలో అత్యధిక ఓట్ల రికార్డు



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని