Jammu Kashmir: కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తొయిబా కమాండర్‌ హతం

తాజా వార్తలు

Updated : 16/10/2021 19:05 IST

Jammu Kashmir: కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తొయిబా కమాండర్‌ హతం

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు పోలీసులు, భద్రతాదళాలు ముమ్మర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం ద్రంగ్‌బల్‌లో పోలీసులు, భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్‌ ఖండేతోపాటు మరో ఉగ్రవాది హతమయ్యారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సదరు ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్ అనంతరం వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రినీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పోలీసుల హత్య కేసులో నిందితుడు..

ఈ ఏడాది ఆగస్టులో కశ్మీర్‌ పోలీసులు విడుదల చేసిన టాప్‌- 10 ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉమర్ ముస్తాక్ ఖండే పేరూ ఉంది. ఇటీవల శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసులను హత్య చేసిన కేసులోనూ ఇతను నిందితుడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కశ్మీర్‌ లోయలో నిన్న సాయంత్రం నుంచి ఇది మూడో ఎన్‌కౌంటర్ కాగా, వారం వ్యవధిలో చేపట్టిన తొమ్మిదో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్. మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కశ్మీర్‌లో ఇటీవల వరుసగా జరిపిన ఉగ్ర దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బలగాలు భారీ ఎత్తున తనిఖీలు చేపడుతున్నాయి. ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు, లోయలో అల్లర్లు, గందరగోళాన్ని వ్యాప్తి చేసేందుకు యత్నిస్తున్న ముష్కరుల ఏరివేతకు కట్టుబడి ఉన్నామని పోలీసులు ట్వీట్ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని