అమెరికాలో మరోసారి కాల్పుల మోత

తాజా వార్తలు

Published : 03/05/2021 10:09 IST

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

విస్కాన్సిన్‌: అమెరికాలో మరోసారి  కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్‌ ప్రాంతం అశ్వాబెనోన్‌లోని ఓ క్యాసినోలోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో దండగుడు హతమయ్యాడు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే సదరు దుండగుడు ఓ వ్యక్తిని హతమార్చేందుకు జూదశాలలోకి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఎవరి కోసమైతే వచ్చాడో ఆ వ్యక్తి కనిపించకపోవడంతో కోపంతో చుట్టుపక్కల వారిపై కాల్పులకు తెగబడినట్లు వెల్లడించారు. 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. 
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని