Spelling Bee: చరిత్ర సృష్టించిన ఆఫ్రికన్‌ అమెరికన్‌

తాజా వార్తలు

Published : 09/07/2021 22:55 IST

Spelling Bee: చరిత్ర సృష్టించిన ఆఫ్రికన్‌ అమెరికన్‌

వాషింగ్టన్‌: అమెరికా ప్రతిష్టాత్మక స్పెల్లింగ్‌ బీ పోటీల్లో ఈ ఏడాది 209 మంది చిన్నారులు పాల్గొన్నారు. అందులో 11 మంది ఫైనల్‌కు చేరుకోగా.. గురువారం జరిగిన ఫైనల్‌ పోటీలో అఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్‌ గార్డే ఛాంపియన్‌గా నిలిచారు. స్పెల్లింగ్ బీ పోటీల 93 ఏళ్ల చరిత్రలో 14 ఏళ్ల జైలా ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా రికార్డు నెలకొల్పారు.  భారత సంతతికి చెందిన చిన్నారులు చైత్ర తుమ్మల రన్నరప్ గానూ, భావన మదిని మూడో స్థానంలో నిలిచారు. అమెరికాలోని ఫోర్లిడాలో లేక్ బ్యూయేనా విస్టా వేదికగా ఈ పోటీలను నిర్వహించారు. 

1999 నుంచి జరుగుతున్న ఈ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో అమెరికన్లతో పోటీ పడుతూ భారత సంతతి చిన్నారులు సత్తా చాటుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఫైనల్‌కు చేరుకున్న 11 మంది చిన్నారుల్లో 9 మంది భారత సంతతికి చెందినవారే. అంతకుముందు 2019లో 8 మంది కో ఛాంపియన్లుగా నిలవగా.. వారిలో ఏడుగురు భారత సంతతి చిన్నారులే ఉండడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ పోటీల్లో మొత్తం 26 మంది ఇండో-అమెరికన్‌ చిన్నారులు ఛాంపియన్లుగా నిలిచారు. కరోనా కారణంగా గతేడాది స్పెల్లింగ్‌ బీ పోటీలు రద్దయ్యాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని