ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి 

తాజా వార్తలు

Updated : 19/04/2021 06:42 IST

ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి 

కైరో: ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజధాని కైరోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్‌ అనే ఓ చిన్న పట్టణం వద్ద రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 98 మంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు  సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 50కి పైగా అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో ఎక్కువ సంఖ్యలో మైనర్లు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.  

రైలు కైరో నుంచి మన్సోరా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాద దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. గత నెలలో కూడా ఈజిప్ట్‌లో రెండు రైళ్లు ఢీకొని 32 మంది మరణించగా, 165 మంది గాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని