close

తాజా వార్తలు

Updated : 27/09/2020 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాన్‌లో మంటలు..13 మంది సజీవదహనం

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను బోల్తా కొట్టడంతో భారీ ఎత్తున మంటలంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి, డ్రైవర్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వ్యానులో 20 మంది ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కరాచీ వస్తున్న సమయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కారు కింది భాగంలో ఉండే ‘టై రాడ్‌’ విరిగిపోవడం వల్లే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో వాహన వేగం అధికంగా ఉండడంతో బోల్తా కొట్టిన వ్యానులో వెంటనే మంటలు అంటుకున్నాయని కరాచీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అవి కాస్తా ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని.. దీంతో ప్రయాణికులు మృతి చెందారని వెల్లడించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.