
ప్రధానాంశాలు
కొవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
టీకాను బహిరంగ విపణిలోకి అనుమతించాలి: మంత్రి ఈటల
ఈనాడు, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో సత్వరమే కట్టడి చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుండటంపైనా దృష్టిసారించింది. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ఉన్నతాధికారులతో వైద్యమంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందనీ, పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఈటల స్పష్టం చేశారు. ‘‘కొవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం నియంత్రణలో ఉన్న వైరస్ తిరిగి ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టడం, కర్ఫ్యూ విధించడం వంటి ఆలోచనలు ఎంత మాత్రం లేవు. ఆ పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. వైరస్‌ను అదుపులో పెట్టడానికి విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఏ మాత్రం అనుమానిత లక్షణాలున్నా కూడా పరీక్షలు చేయించుకోవాలని ప్రచారం చేస్తున్నాం. ఇంటింటికి తిరిగి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించి పరీక్షలు చేయిస్తున్నాం. కొవిడ్ బాధితులకు ప్రభుత్వ వైద్యంలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న వారికి ఐసొలేషన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో కేసులు పెరిగిన దాఖలాల్లేవు. ఒకవేళ కేసులు పెరిగితే గతంలోలాగా గాంధీ, టిమ్స్, నిమ్స్‌ల్లో ప్రత్యేక చికిత్సలకు ఏర్పాట్లు చేస్తాం. కొవిడ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యపు ధోరణి మంచిది కాదు.’’ అని మంత్రి తెలిపారు. కొవిడ్ టీకాకు స్వల్ప ధరను నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం బహిరంగ విపణిలోకి అనుమతించాలని మంత్రి కోరారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 11 లక్షలకు పైగా కొవిడ్ టీకా డోసులొచ్చాయని తెలిపారు.50 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం అనుమతించినప్పుడు తాను టీకా తీసుకుంటానన్నారు.
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిందనీ, అయినా ముప్పు పూర్తిగా తొలగిపోలేదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. కరీంనగర్లో ఒకరి అంతిమయాత్రలో పాల్గొన్నవారు నిబంధనలు పాటించకపోవడం వల్ల 35 మందికి కొవిడ్ సోకిందని తెలిపారు. కొవిడ్ టీకా వల్ల రక్షణ లభిస్తుందని, అర్హులైన వారందరూ టీకాలకు ముందుకు రావాలని కోరారు. మద్యం తీసుకునేవారు టీకా పొందకూడదనేది అపోహ మాత్రమేనన్నారు. మార్చి మొదటి వారంలో 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలను అందజేస్తామన్నారు.
స్వేచ్ఛగా రాకపోకలు
సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లరా గ్రామం మీదుగా మహారాష్ట నుంచి నిత్యం వేల సంఖ్యలో రాష్ట్రంలోకి ప్రయాణికులు వస్తుంటారు. ఆ ప్రాంతంలో ప్రయాణికులకు ఎలాంటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలేదు. ఆదిలాబాద్ జిల్లాలోకి రాకపోకలు సాగిస్తున్న మహారాష్ట్ర బస్సుని చిత్రంలో చూడవచ్చు. అంతరచిత్రంలో గతంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించిన కేంద్రం.
- ఈనాడు, ఆదిలాబాద్
ప్రధానాంశాలు
దేవతార్చన

- నేనున్నానని..
- రివ్యూ: పవర్ ప్లే
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- మనసు లాగుతోందా బంగారం
- అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!
- నలుగురితో ప్రేమ.. లక్కీ డ్రా తీసి ఒకరితో పెళ్లి!
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
- పంత్.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్