close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో 1,921 కరోనా కేసులు

88 వేలు దాటిన బాధితులు
మహమ్మారికి మరో 9 మంది బలి
ఏడు లక్షలు దాటిన నిర్ధారణ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా గురువారం 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 88,396కు పెరిగింది. ఈ నెల 13న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది. తాజా ఫలితాల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌)లో 356 కేసులు నమోదవగా 20కి పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారించిన జాబితాలో 26 జిల్లాలున్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 168, రంగారెడ్డిలో 134, సంగారెడ్డిలో 90, వరంగల్‌ నగరజిల్లాలో 74, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో 73 మంది చొప్పున, ఖమ్మంలో 71, నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో 63 మంది చొప్పున, వరంగల్‌ గ్రామీణ, పెద్దపల్లి జిల్లాల్లో 54 మంది చొప్పున, జోగులాంబ గద్వాలలో 51, మహబూబ్‌నగర్‌లో 48, సూర్యాపేటలో 47, కామారెడ్డిలో 44, వనపర్తిలో 41, జగిత్యాలలో 40, మెదక్‌లో 39, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో 38 మంది చొప్పున, నిర్మల్‌లో 37, భద్రాద్రి కొత్తగూడెంలో 34, రాజన్న సిరిసిల్లలో 33, ఆదిలాబాద్‌లో 28, నాగర్‌కర్నూల్‌లో 26, జయశంకర్‌ భూపాలపల్లిలో 21 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు.
రాష్ట్రంలో గురువారం 22,046 నమూనాలను పరీక్షించారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 7,11,196 పరీక్షలను నిర్వహించారు. వీటిలో మరో 1,151 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజాగా మరో 1,210 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా మొత్తంగా కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా మారినవారి సంఖ్య 64,284కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్నవారి శాతం 72.72 శాతం కాగా ఈ విషయంలో జాతీయ సగటు 70.76శాతంగా ఉంది. మహమ్మారి కారణంగా మరో 9 మంది మృతిచెందగా రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 674కు పెరిగింది. మొత్తం పాజిటివ్‌ల్లో మరణాల శాతం 0.76 శాతం కాగా ఈ విషయంలో జాతీయ సగటు 1.96 శాతంగా నమోదైనట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 23,438 మంది చికిత్స పొందుతుండగా వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌, ఇళ్లలో స్వీయ నిర్బంధంలో చికిత్స పొందుతున్నవారు 16,439 మంది ఉన్నారు. గురువారం నాటికి కొవిడ్‌ చికిత్సలకు ప్రభుత్వ వైద్యంలో 5,824 పడకలు ఖాళీగా ఉండగా, ప్రైవేటు వైద్యంలో 3,492 పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

ద.మ.రైల్వేలో భారీగా కేసులు
వరుసగా కరోనా కేసులతో రైల్వే ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలో సికింద్రాబాద్‌, గుంతకల్లు రెండు డివిజన్లలో జులై 18-31 మధ్య 13 రోజుల వ్యవధిలోనే ఏకంగా 290 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. 10 మంది మరణించారు. అయితే ద.మ.రైల్వే గోప్యతను పాటిస్తూ.. కరోనా బులిటెన్‌ విడుదల చేయడం లేదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.