close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాట తప్పారు.. రాజీనామా చేస్తారా?

చెప్పింది చేయకపోతే వైదొలగాలని మీరే అన్నారుగా..
సీఎం జగన్‌ను నిలదీసిన చంద్రబాబు
అమరావతే రాజధాని అంటే.. తమ పదవులూ ఇచ్చేస్తామని వెల్లడి
కేంద్రం జోక్యం చేసుకోవాలని విన్నపం

అసాధారణ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం చేసేది సరైన పని కాదని, పెట్టుబడిదారుల నమ్మకం పోతుందని చెప్పింది. అమరావతిలోనూ రైతులతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో కేంద్రానికీ బాధ్యత ఉంది. పీపీఏల్లో పెట్టుబడిదారులుంటే.. ఇక్కడ రైతులున్నారు.  కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నా.
ఈనాడు, అమరావతి: అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అలా చేస్తే తమ శాసనసభ్యత్వాలనూ వదులుకుంటామని ప్రకటించారు. ‘ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని పదే పదే మాట్లాడి.. ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో అమరావతిని ఆవెెూదించారా.. లేదా?’ అని ప్రశ్నించారు. ‘చెప్పింది చేయకపోతే నిలదీయండి, రాజీనామా చేసి వెళ్లిపోతానని చెప్పిన మీరు (సీఎం).. మాట తప్పారు. ఇప్పుడు మరి రాజీనామా చేస్తారా? అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా?’ అని నిలదీశారు. ‘మాట తప్పడం ఇంటా వంటా లేదనే ఆయన.. ఎన్నికలంటే పారిపోయారు’ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బుధవారం సాయంత్రం వీడియో సమావేశం ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైకాపా అధికారంలోకి వస్తే అమరావతిని సర్వనాశనం చేస్తారని.. ఎన్నికలకు ముందే ప్రజలను హెచ్చరించానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘చట్టంలో ఉన్న ప్రకారం సుప్రీంకోర్టు ఆవెెూదంతో.. రాష్ట్రపతి ప్రకటన జారీచేయడంతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి శంకుస్థాపన చేశారు. అయినా హైకోర్టును మార్చేస్తామనడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. ‘విశాఖపట్నం వాసులు నీతి, నిజాయతీకి కట్టుబడతారు, ప్రశాంత జీవితం గడపాలనుకుంటారు. హుద్‌హుద్‌ సమయంలో నేను ఒక్క పిలుపిస్తే.. ముందుకొచ్చారు’ అని ప్రశంసించారు. ‘అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. రాజధాని అమరావతిలో ఉంటుందని అంతా కలిసి ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట కోసమే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం’ అని చెప్పారు. ‘అయోధ్యలో రామాలయం సమస్యను పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి కూడా దేవతల రాజధాని. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి మట్టిని, యమునా జలాలను తెచ్చి శంకుస్థాపన చేశారు. దేశమంతా అమరావతికి అండగా ఉంటుందని చెప్పారు. అయోధ్య సమస్య లాగే.. ఇక్కడా రైతుల సమస్య పరిష్కరించాలి’ అని చంద్రబాబు కోరారు.
ప్రజలే మంచి చెడులు విశ్లేషించాలి
రాజధానిగా అమరావతే ఎందుకు ఉండాలి? దీనివల్ల లాభాలేంటో వివరిస్తూ పత్రాలు విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. వాటిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. ప్రజలు కూడా మంచి చెడుల్ని విశ్లేషించాలని కోరారు. ‘అంతా కలిసి పోరాడదాం.. అమరావతిని కాపాడుకుందాం’ అని విజ్ఞప్తి చేశారు.
‘జగన్‌మోహన్‌రెడ్డికి కనువిప్పు కలగాలనే.. ఆయన మాటల వీడియోలు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల్ని చూపిస్తున్నా’ అని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక ఎప్పుడేం చెప్పారో తెలియజేస్తూ.. వీడియో ప్రదర్శించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.