close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హైదరాబాద్‌ తూర్పున ఐటీ వెలుగులు

కొత్త పరిశ్రమలకు ఏర్పాట్లు
30 వేల ఉద్యోగావకాశాలు
ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరం నలుమూలలా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం త్వరలో గ్రిడ్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసి, 25 లక్షల చదరపు అడుగుల మేరకు ఐటీ పార్కులు, కార్యాలయాలకు అవసరమైన స్థలాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనివల్ల ఉప్పల్‌ ప్రాంతంలో మరో 30,000 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతే ఆ స్థలాలను ఐటీ కార్యాలయాలకు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. బుధవారం హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్‌ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ నలువైపులా సమతులంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాల్లోనూ ఐటీ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకువస్తున్న గ్రిడ్‌ విధానం దీనికి ఉపకరిస్తుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే ఇన్ఫోసిస్‌, జెన్‌పాక్ట్‌ వంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. త్వరలో నగరానికి తూర్పు వైపున మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ మెట్రో, శిల్పారామం, మూసీ నది అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులు పెరుగుతున్నాయి. ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వైపు, అంబర్‌పేట రామంతాపూర్‌ ఫ్లైఓవర్ల ద్వారా రవాణా సదుపాయాలు మరింత పెరుగుతాయి’’ అని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తూర్పు హైదరాబాద్‌లో ఐటీ పార్కులు, కార్యాలయాల స్థలాల కోసం అయిదు సంస్థలకు మార్పిడి పత్రాలను అందజేశారు. రాచకొండ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమాచార సంచికను ఆయన అవిష్కరించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐటీ పార్కుల ఏర్పాటుకు అనుమతులు పొందిన సంస్థలివి..
హైదరాబాద్‌లోని మూడు పారిశ్రామిక పార్కుల్లో ఉన్న 35 ఎకరాల్లోని పారిశ్రామిక పార్కుల స్థానంలో ఐటీ పార్కులు, కార్యాలయాల ఏర్పాటుకు అయిదు సంస్థలు అనుమతులు పొందాయి. హైదరాబాద్‌ డిస్టిలరీస్‌, వైనరీస్‌ (12.40 ఎకరాలు, ఉప్పల్‌), మినాక్టో కెమ్‌ (2.66 ఎకరాలు, ఉప్పల్‌), స్వామి సోప్స్‌ అండ్‌ ఆయిల్స్‌ (2 ఎకరాలు, ఉప్పల్‌), గోకుల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ (నాచారం 8.93 ఎకరాలు), బేక్‌లైట్‌ హైలం (8 ఎకరాలు, నాచారం)లకు ప్రభుత్వం అనుమతించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.