close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మిర్యాలగూడ ఎమ్మెల్యేకు కరోనా

రాష్ట్రంలో కొత్తగా 1,597 కేసులు
40 వేలకు చేరువలో బాధితులు
ఇంకో 11 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కొవిడ్‌ బారినపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తెరాస ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు. రెండురోజుల కిందట ఆయన పరీక్ష చేయించుకోగా, బుధవారం ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన మిర్యాలగూడలోని తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో బుధవారం తాజాగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలో 796 కేసులు రాగా, రంగారెడ్డిలో 212, మేడ్చల్‌లో 115, సంగారెడ్డిలో 73, నల్గొండలో 58, వరంగల్‌ నగరంలో 44, కరీంనగర్‌లో 41, కామారెడ్డిలో 30,  సిద్దిపేటలో 27, మంచిర్యాలలో 26, మహబూబ్‌నగర్‌లో 21, పెద్దపల్లిలో 20, మెదక్‌లో 18, జయశంకర్‌ భూపాలపల్లిలో 15, సూర్యాపేటలో 14, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్‌లలో 13, చొప్పున కేసులు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో 29 జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 39,342కు పెరిగింది. మహమ్మారితో తాజాగా 11 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 13,642 నమూనాలను పరీక్షించారు. మొత్తంగా 2,08,666 పరీక్షలు నిర్వహించారు.

అందుబాటులో 15,239 పడకలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మొత్తం 17,081 పడకల్లో బుధవారం నాటికి 1,842 పడకలపై రోగులకు సేవలందిస్తుండగా, 15,239 పడకలు ఖాళీగా అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గాంధీలోనూ 994 పడకలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.

సమస్యలపై ఫిర్యాదుచేయండి
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏమైనా సమస్యలుంటే 91541 70960 నంబరుకు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

ఏపీలో 2,432 కేసులు.. 44 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఆందోళన పెంచుతోంది. ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా 2,432 మంది వ్యాధి బారిన పడగా, 44 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 452కు చేరుకున్నాయి. ఇంతవరకు రాష్ట్రంలో 35,451 మందికి కొవిడ్‌ సోకింది. ప్రతిరోజూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తిరుమలలో 11 మంది అర్చకులకు పాజిటివ్‌
తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే 11 మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. బుధవారం వీరిని వైద్యపరీక్షల నిమిత్తం తిరుపతికి తరలించారు. తితిదేలో పనిచేస్తున్న 91 మంది, నలుగురు అర్చకులు ఇప్పటికే కరోనా బారినపడ్డారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.