close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో కొత్త కేసులు 1896

మరో 8 మంది మృతి
82 వేలు దాటిన బాధితుల సంఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 1896 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 82,647కు, మరణాల సంఖ్య 645కి పెరిగింది. ఈ నెల 10వ తేదీ రాత్రి 8 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 338 కేసులు నిర్ధారణ అయ్యాయి.

20కి పైగా కొత్త కేసులు నమోదైన జిల్లాలు: రంగారెడ్డి(147), కరీంనగర్‌(121), మేడ్చల్‌ మల్కాజిగిరి(119), వరంగల్‌ నగర(95), జోగులాంబ గద్వాల(85), కామారెడ్డి(71), జనగామ(71), పెద్దపల్లి(66), ఖమ్మం(65), సిద్దిపేట(64), భద్రాద్రి కొత్తగూడెం(60), జగిత్యాల(59), మహబూబ్‌నగర్‌(58), నల్గొండ(54), సంగారెడ్డి(49), నిజామాబాద్‌(42), రాజన్న సిరిసిల్ల(38), వరంగల్‌ గ్రామీణ(35), సూర్యాపేట(32), వనపర్తి(28), యాదాద్రి భువనగిరి(24), మహబూబాబాద్‌(23), ములుగు(23), వికారాబాద్‌(21), జయశంకర్‌ భూపాలపల్లి(20).
పరీక్షలు: సోమవారం 18,035 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 6,42,875కు పెరిగింది. మరో 959 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.

కోలుకున్నవారు: సోమవారం 1788 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 59,374 మంది వ్యాధి నుంచి బయటపడ్డారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్నవారు 71.84% మంది ఉన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 69.33%.

చికిత్స: 22,628 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌లో, ఇళ్లలో స్వీయ నిర్బంధంలో చికిత్స పొందుతున్నవారు 15,554 మంది ఉన్నారు.

పడకలు: ప్రభుత్వ వైద్యంలో 2,629 పడకలు, ప్రైవేటులో 4,445 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం వద్ద 5,807 పడకలు, ప్రైవేటులో 3,212 పడకలు ఖాళీగా ఉన్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.