close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ఇంటికి ఇల్లాలి కళ

ఆమె.. ఆ ఇంటి ఇల్లాలు. ఇంటిల్లిపాదికి దేవత. ఓ చక్కని ఇల్లు కట్టుకోవాలని, అందులో హాయిగా కలిసిమెలిసి గడపాలని ఎన్నో కలలుగన్నారామె. ఇంటికి నమూనా కూడా తయారుచేయించారు. అంతలో అనూహ్యంగా ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె కలలు సాకారం చేస్తూ ఇల్లు నిర్మించుకున్న ఆ కుటుంబం ఆమె లేని లోటు కన్పించకుండా గృహప్రవేశ వేడుక జరుపుకొన్నారు. కుటుంబ విలువలకు అద్దంపట్టిన ఈ సంఘటనకు కర్ణాటకలోని కొప్పళ పట్టణం వేదికైంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కె.శ్రీనివాసగుప్తా సతీమణి వెంకట నాగమాధవి. వీరి కుటుంబం తిరుపతి యాత్రకు వెళ్లినప్పుడు జరిగిన ప్రమాదంలో నాగమాధవి చనిపోయారు. ఇది ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఆమె కలల రూపమైన చక్కని ఇంటిని భర్త, పిల్లలు సాకారం చేశారు. ఆమె లేని వెలితి ఉండరాదని బెంగుళూరుకు చెందిన కళాకారుడు శ్రీధర్‌ను సంప్రదించారు.సిలికాన్‌ మెటీరియల్‌తో ఇలా నాగమాధవి బొమ్మను రూపొందించి గృహప్రవేశం నిర్వహించారు. జీవకళ ఉట్టిపడుతున్న ఈ బొమ్మ.. ఆ ఇంటికి ఇల్లాలు లేని లోటు తీర్చింది.
 

- న్యూస్‌టుడే, గంగావతి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.