close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాధితులు @ 80 వేలు

కొత్తగా 1,256 కేసులు
మరో 10 మరణాలు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ఆదివారం 1,256 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. పది మంది చనిపోయారు. మొత్తంగా బాధితుల సంఖ్య 80,751కి పెరిగింది. శనివారం 1,982 కేసులు నమోదవగా 12 మంది మృతి చెందారు. ఈనెల 9న రాత్రి 8 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 389 కేసులు నమోదవగా, 20కి పైగా పాజిటివ్‌లు నిర్ధారించిన జిల్లాల జాబితాలో రంగారెడ్డి(86), సంగారెడ్డి(74), కరీంనగర్‌(73), వరంగల్‌ నగర(67), ఆదిలాబాద్‌(63), నల్గొండ(58), సిద్దిపేట(45), నాగర్‌కర్నూల్‌(38), మేడ్చల్‌ మల్కాజిగిరి(34), నిజామాబాద్‌(33), రాజన్న సిరిసిల్ల(31), ఖమ్మం(28), పెద్దపల్లి(23), మహబూబ్‌నగర్‌(21), జనగామ(20), సూర్యాపేట(20) ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఈనెల 3న 9 కేసులు నమోదవగా ఆదివారానికి ఆ సంఖ్య 63కి చేరింది. సంగారెడ్డిలోనూ ఇలాగే 15 నుంచి 74కు పెరిగింది. గత వారంలో దాదాపు అన్ని రోజులు పెద్దసంఖ్యలో కేసులు నమోదై ఆదివారం మాత్రం తగ్గిన వాటిల్లో జీహెచ్‌ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, జనగామ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ నగర జిల్లాలున్నాయి.
71.31 శాతం కోలుకున్నారు
రాష్ట్రంలో ఆదివారం మరో 1,587 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 57,586కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ల్లో ఇది 71.31 శాతం. కోలుకున్నవారి జాతీయ సగటు 68.78 శాతంగా ఉన్నట్లు వైద్యశాఖ పేర్కొంది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 10 మంది మృత్యువాత పడగా, ఇప్పటి వరకూ కొవిడ్‌ మృతుల సంఖ్య 637కు పెరిగింది. మొత్తం పాజిటివ్‌ల్లో కరోనా మృతుల శాతం రాష్ట్రంలో 0.78 కాగా, జాతీయ సగటు 2.01 శాతమని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాతో రాష్ట్రంలో 22,528 మంది చికిత్స పొందుతుండగా, ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లో, ఇళ్లలో ఉంటూ చికిత్స పొందుతున్నవారు 15,789 మంది ఉన్నారు. ఇళ్లలో చికిత్స పొందుతున్నవారిలో 84 శాతం మందిలో ఎటువంటి కొవిడ్‌ లక్షణాలు లేవని వైద్యశాఖ తెలిపింది. ఆదివారం 11,609 నమూనాలను పరీక్షించగా, ఇప్పటి వరకూ మొత్తం పరీక్షల సంఖ్య 6,24,840కి పెరిగింది. ఇంకా 1,700 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. రాష్ట్ర జనాభాలో ప్రతి 10 లక్షల మందికి సగటున 16,830 నమూనాలను పరిశీలిస్తున్నట్లు  ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈనెల 9 నాటికి ప్రభుత్వ వైద్యంలో కొవిడ్‌ చికిత్సకు నిర్దేశించిన 8,436 పడకలకు గాను 5,906 పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలోని 6,850 పడకల్లో 2,641 ఖాళీగా ఉన్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.