close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫిర్యాదులకు కొత్త వేదిక

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, మెసేజ్‌ ద్వారా సమస్యలు సర్కారు దృష్టికి!

ఈనాడు, హైదరాబాద్‌: సమాజంలో అవినీతిని సర్కారు దృష్టికి తేవాలన్నా, సమస్యలపై వినతులు సమర్పించాలన్నా, ఫిర్యాదులు పరిష్కారపరంగా  ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా ఇకపై చాలా సులభం. పరిపాలన సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం కేంద్రీకృత ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకటి రెండు నెలల్లో ఇది ప్రారంభం కానుంది. పకడ్బందీ వ్యవస్థ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది.

సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ఇతర ఏర్పాట్ల కోసం సర్కారు తాజాగా టెండర్లు పిలిచింది. ఐటీ శాఖ ద్వారా అర్హతలున్న సంస్థను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించనుంది. సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలు తదితర అంశాలపై  సులభంగా ఫిర్యాదు చేయడం, వాటిని సత్వరమే పరిష్కరించడం కోసం దీనికి రూపకల్పన చేయనున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణిలో,  సచివాలయంలో ప్రజలు చేసే ఫిర్యాదులు, సమర్పించే వినతులనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాటి పరిష్కారం సరిగా లేదు. ఆరా తీసినా ఎవరూ బదులివ్వడం లేదు. కరోనా మొదలయ్యాక నేరుగా ఫిర్యాదులు చేయడానికి అనుమతించడం లేదు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల కోసం పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. తాత్కాలిక సచివాలయమైన బీఆర్‌కే భవన్‌ కేంద్రంగా కేంద్రీకృత ఫిర్యాదుల కేంద్రం(కాల్‌ సెంటర్‌) ఉంటుంది. రాష్ట్రస్థాయిలోనూ, జిల్లాల్లోనూ, రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాలు, గ్రామ సచివాలయాల వరకు అనుసంధాన వ్యవస్థ ఉంటుంది. అర్జీలకు తోడు ఫోన్‌, వాట్సప్‌, సంక్షిప్త సందేశం(మెసేజ్‌), ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత విభాగాలకు పంపిస్తారు. వీటన్నింటి పరిష్కారంపై వెంటనే సంబంధిత అధికారులు, శాఖలు కేంద్రీకృత విభాగానికి సమాచారం పంపించాలి. ప్రతి ఫిర్యాదు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరుతుంది. ఆయా శాఖల ఉన్నతాధికారులకు వారికి సంబంధించినవి చేరతాయి. ఫిర్యాదులు పరిష్కారమైనట్లు శాఖల నుంచి సమాచారం వస్తే వెంటనే ఫిర్యాదుదారులకు ఫోన్‌ చేసి ఆరా తీస్తారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని కీలకంగా భావించి, సమీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వనుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.