close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తొలి ప్రయత్నంలో విజేతలు అతి స్వల్పం

 ఆశించిన సివిల్‌ సర్వీస్‌ కోసం పట్టు విడవకుండా ప్రయత్నం
 విజేతల్లో అధిక శాతం మంది ఇంచ్కీజిజినీరింగ్‌ పట్టభద్రులే
ఈనాడు, హైదరాబాద్‌

తొలి ప్రయత్నంలో సఫలమయ్యేది అతి తక్కువ మందే...రెండో ప్రయత్నంలో విజయం సాధించినా వారు ప్రయత్నం ఆపరు. ఉద్యోగం చేస్తూనే మళ్లీ మంచి ర్యాంకు కోసం అహర్నిశలు శ్రమిస్తారు....చివరకు విజేతలుగా నిలుస్తారు...ఎంతో మందికి స్ఫూర్తినిస్తారు. వారే దేశంలో అత్యున్నత సర్వీస్‌ అయిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో మెరిచిన తెలుగు తేజాలు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది సివిల్స్‌కు ఎంపిక కాగా వారిలో తొలి ప్రయత్నంలో విజయం సాధించిన వారు అతి కొద్ది మంది మాత్రమే. ఎక్కువ మంది రెండు, మూడు, నాలుగో ప్రయత్నంలో విజయాన్ని సొంతం చేసుకున్న వారే. కరీంనగర్‌ చ్కీజిజిల్లాకు చెందిన సత్యసాయి కార్తీక్‌ మూడు సార్లు ప్రిలిమినరీ పరీక్ష గట్టెక్కలేదు. నాలుగో ప్రయత్నంలో మాత్రం ఏకంగా 103వ ర్యాంకుతో మెరిశారు. జనగామ చ్కీజిజిల్లాకు చెందిన ప్రేమ్‌సాగర్‌ మొదటి ప్రయత్నంలో మెయిన్స్‌ వరకు వెళ్లారు. రెండోసారి 170వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల విజేతల్లో అత్యధికులు ఇంచ్కీజిజినీరింగ్‌ పట్టభద్రులే. అందులో 46వ ర్యాంకు విజేత ధాత్రిరెడ్డి ఐఐటీ ఖరగ్‌పూర్‌, 110వ ర్యాంకు మకరంద్‌ ఐఐటీ దిల్లీ పట్టభద్రులు.
మళ్లీ...మళ్లీ...
తాజా విజేతల్లో పలువురు గతంలో సర్వీస్‌కు ఎంపికైనా అనుకున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ రాలేదని మళ్లీ ప్రయత్నించి సఫలమైన వారే కావడం విశేషం. గత ఏడాది (సివిల్స్‌ 2018) రెండో ప్రయత్నంలో 233 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికైన పి.ధాత్రిరెడ్డి ఈసారి మళ్లీ ప్రయత్నించి 46వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో అగ్ర స్థానంలో నిలిచారు. ఐఏఎస్‌ కావడమే లక్ష్యంగా ప్రయత్నించి సఫలమయ్యారు. గత ఏడాది రెండో ప్రయత్నంలో 349వ ర్యాంకు సాధించి ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌కు ఎంపికైన కట్టా రవితేజ ఈసారి మళ్లీ రాసి 77వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. సివిల్స్‌ 2018లో 245 ర్యాంకు దక్కించుకున్న గురిజాల చందీష్‌ ఈసారి 198వ ర్యాంకు సాధించారు.
ఇవీ మార్పులు...ధోరణులు
* తొలిసారి ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌) కోటా ప్రవేశపెట్టారు. దాంతో గత ఏడాదితో పోల్చుకుంటే తెలుగు వారు అధికంగా ఎంపికయ్యారని నిపుణులు చెబుతున్నారు.
*  ఐఐటీల్లో చదివినా ఎక్కువ మంది తాను చదివిన సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకుంటారు. ఈసారి గణితం, ఇంచ్కీజిజినీరింగ్‌ సబ్జెక్టులైన మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ తదితర సబ్జెక్టులను ఎంచుకున్న వారు పెరిగారని అనలాగ్‌ సివిల్స్‌ శిక్షణ సంస్థ సంచాలకుడు శ్రీకాంత్‌ చెప్పారు. ఉదాహరణకు 110వ ర్యాంకర్‌ మకరంద్‌ గణితాన్ని ఎంచుకున్నారు.
* ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉందని చెబుతున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.