close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటర్నెట్‌ లేని కంప్యూటరే వాడండి

  ప్రభుత్వాధికారులకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక యుగంలో రకరకాల పద్ధతుల్లో సైబర్‌ నేరగాళ్ళు కంప్యూటర్లు, ఫోన్లలోకి జొరబడి విలువైన సమాచారం తస్కరిస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత నష్టంతోపాటు ఒక్కోసారి దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖలోని సైబర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (సీఐఎస్‌) విభాగం సైబర్‌ నేరాల బారినపడకుండా ఉండేలా ప్రభుత్వ అధికారులకు ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి చెందిన రహస్యాలు బయటకు పొక్కకుండా చూడటమే.
   మార్గదర్శకాల్లో ప్రధానమైనవి
* ఆయా ప్రభుత్వశాఖలకు సంబంధించి కీలకమైన పనులను ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంప్యూటర్‌ ద్వారానే చేయాలి.
* ప్రతి ఒక్కరూ అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులతో కూడిన అత్యంత దృఢమైన పాస్‌వర్డ్‌ రూపొందించుకోవాలి.
* ప్రతి ప్రభుత్వ ఉద్యోగీ తాను వాడుతున్న కంప్యూటర్‌లోని ఆపరేటింగ్‌ వ్యవస్థ, సాఫ్ట్‌వేర్‌, యాంటీవైరస్‌లు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూసుకోవాలి. వీటికి సంబంధించిన ఆటో అప్‌డేట్‌ వ్యవస్థనూ ఆన్‌లోనే ఉంచుకోవాలి.
* ఎప్పటికప్పుడు సమాచారాన్ని బ్యాకప్‌ తీసుకుంటుండాలి.
* ప్రభుత్వానికి చెందిన సమాచారం ఏదీ ప్రైవేట్‌ క్లౌడ్‌ సర్వీస్‌లో నిల్వ చేయకూడదు. ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఎవరైనా అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
* పాస్‌వర్డ్‌ చౌర్యం ద్వారా సాధారణంగా సైబర్‌ నేరగాళ్ళు కంప్యూటర్‌, ట్యాబ్‌, ఫోన్లలోకి జొరబడి కీలకమైన సమాచారం చోరీ చేస్తుంటారు. వారి నుంచి రక్షణకు పాస్‌వర్డ్స్‌ను తరచూ మార్చుతుండాలి. ‘పాస్‌వర్డ్‌ గుర్తుంచుకో’ సదుపాయం వాడుకోవద్దు.
* ప్రభుత్వం ఇచ్చిన ఈ-మెయిల్‌ చిరునామానే వాడాలి.
* కీలకమైన సమాచారం ఏదీ ఈ-మెయిల్‌ ద్వారా పంపవద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పంపాల్సి వస్తే సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలి.
* ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వారెవరూ ప్రభుత్వం సమకూర్చిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ద్వారా సామాజిక మాధ్యమాలను వాడకూడదు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.