close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో 1924 కేసులు

మరో 11 మంది మృతి
29 వేలు దాటిన బాధితులు

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 1924 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 29,536కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌)లో 1590 పా జిటివ్‌లు నిర్ధారించారు. రంగారెడ్డి  జిల్లాలో 99, మేడ్చల్‌లో 43, సంగారెడ్డిలో 20, కరీంనగర్‌లో 14, మహబూబ్‌నగర్‌లో 15, నల్గొండలో 13, వరంగల్‌ గ్రామీణలో 26, నిజామాబాద్‌లో 19, వికారాబాద్‌లో 11, రాజన్న సిరిసిల్ల  జిల్లాలో 13 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో బుధవారం 25  జిల్లాల్లో పా జిటివ్‌లను గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 11,933 మంది చికిత్స పొందుతుండగా, తాజాగా మరో 992 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17,279కి చేరుకుంది. బుధవారం కరోనా మహమ్మారితో మరో 11 మంది మృత్యువాతపడ్డారు.
దీంతో మొత్తంగా ఇప్పటివరకు 324 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 6,363 నమూనాలను పరీక్షించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 1,34,801 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,05,265 మందికి వైరస్‌ లేదని నిర్ధారణ అయింది. రాష్ట్రంలో బుధవారం నాటికి మొత్తం 17,081 కొవిడ్‌ పడకల్లో 1329 పడకలు బాధితులతో నిండి ఉండగా, 15,752 పడకలు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.