close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోజుకు 2.87 లక్షల మందికి కొవిడ్‌!

వ్యాక్సిన్‌, ఔషధాలు రాకపోతే ఇదే జరగవచ్చు
2021లో భారత్‌ పరిస్థితిపై ఎంఐటీ అధ్యయనం

దిల్లీ: వ్యాక్సిన్‌ గానీ, కొవిడ్‌-19 నివారణ ఔషధాలు గానీ రానిపక్షంలో భారతదేశంలో 2021 శీతాకాలం ముగిసే నాటికి రోజుకు 2.87 లక్షలు చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చే అవకాశం ఉందని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. రోజువారీ ఇన్‌ఫెక్షన్లలో అమెరికాను తోసిరాజని మన దేశం నిలిచే అవకాశం ఉన్నట్లు వారు అంచనా వేశారు. భారత్‌, అమెరికా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, ఇండోనేసియా, బ్రిటన్‌, నైజీరియా, టర్కీ, ఫ్రాన్స్‌, జర్మనీలు తొలి పది స్థానాల్లో నిలుస్తాయని లెక్కకట్టారు. దీనికోసం 84 దేశాలకు చెందిన 475 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని పరిశీలించి నమూనాను అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు తెలిపారు.
భవిష్యత్తులో కచ్చితంగా అన్ని కేసులు వస్తాయని చెప్పలేమని, ఇది అనేక సున్నితమైన అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. మరింత విస్తృతంగా పరీక్షలు నిర్వహించి ఎవరు ఎవరిని కలిశారనేది తెలుసుకోగలిగితే భవిష్యత్తులో కేసులు తగ్గే అవకాశం ఉందని, ఉదాశీనంగా ఉంటే మాత్రం గణనీయంగా పెరిగిపోతాయని తెలిపారు. దేశాలవారీగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, జులై ఒకటి నుంచి అవి రోజుకు 0.1% చొప్పున పెరుగుతాయనే అంచనాలతో భవిష్యత్తు లెక్కల్ని వేసినట్లు వివరించారు. ఎలాంటి లక్షణాలు బయటపడనివారి శాతం, వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తున్న వేగం వంటివి పరిగణనలో తీసుకుని అధ్యయనం చేశారు. కేసులు, మరణాల వివరాలు ప్రస్తుతం సరిగా వెల్లడి కావడం లేదని, జూన్‌ 18 నాటి సమాచారం ప్రకారం.. వాస్తవ కేసులు 11.8 రెట్లు, మరణాలు 1.48 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ‘సామూహిక రోగనిరోధక శక్తి’ సాధించేందుకు చేరువగా ఏ దేశమూ లేదనీ, దాని కోసం నిరీక్షించడం ఆచరణీయ మార్గం కాదని తేల్చారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.