close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో కొత్తగా 1,879 కేసులు

మహమ్మారి ధాటికి మరో ఏడుగురి మృతి
27,612కు పెరిగిన బాధితులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 1,422 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. క్రమేణా హైదరాబాద్‌, పరిసర  జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని  జిల్లాల్లోనూ వైరస్‌ జాడలు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం 27 జిల్లాల్లో కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి  జిల్లాలో 176 పాజిటివ్‌ కేసులు, మేడ్చల్‌లో 94, కరీంనగర్‌లో 32, మహబూబ్‌నగర్‌లో 11, నల్గొండలో 31, వరంగల్‌ నగరలో 13, నిజామాబాద్‌లో 19, మెదక్‌లో 12, ములుగు జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 27,612కు పెరిగింది. మహమ్మారితో మంగళవారం ఏడుగురు మృత్యువాతపడగా, మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 313కు పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో 11,012 మంది చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వ వైద్యంలో మొత్తం 17,081 పడకలు కొవిడ్‌ సేవల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిలో 11,928 పడకలు ఐసోలేషన్‌కు, 3,537 పడకలు ఆక్సిజన్‌ సేవల కోసం, 1,145 పడకలు ఐసీయూకు, 471 పడకలు వెంటిలేటర్‌తోకూడిన ఐసీయూసేవలకోసం సిద్ధంగా ఉన్నాయి. మొత్తం పడకల్లో 1,335(7.8శాతం) పడకలు మాత్రమే కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తుండగా, మరో 15,746(92.2శాతం) పడకలు ఖాళీగా ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గాంధీ ఆసుపత్రిలో మంగళవారం నాటికి మొత్తం 1,890 పడకలకుగాను, 740 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులోనూ ఐసీయూలో ఉన్నవారు 130 మందిగా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.