close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
20వేలు దాటిన కరోనా మరణాలు

78% ప్రాణనష్టం 4 రాష్ట్రాల్లోనే

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా వేగం కాస్త నెమ్మదించింది. రెండ్రోజులు వరుసగా 24వేలకు పైగా నమోదైన కేసులు మంగళవారం నాటికి 22,252కి తగ్గాయి. మహారాష్ట్రలో రోజూ 6 వేలకుపైగా నమోదవుతూ వస్తున్న కేసులు 5 వేలకు తగ్గాయి. తమిళనాడు, దిల్లీల్లోనూ తగ్గుదల ఉండడంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో మరణాలు మునుపటి మాదిరిగానే కొనసాగినా దిల్లీలో మాత్రం అవి 50 లోపునకు పరిమితమయ్యాయి. కరోనా లెక్కల్లో ఇంతవరకు 4 నుంచి 10 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో కేసులు విజృంభించాయి. ఈ ఏడు రాష్ట్రాల్లో ఇదివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో కొత్త కేసులొచ్చాయి. దేశంలో మరణాలు 20,160కి చేరాయి. వీటిలో 45% మహారాష్ట్రలోనే ఉన్నాయి. దాంతోపాటు తమిళనాడు, దిల్లీ, గుజరాత్‌లనూ కలిపితే.. 78% మరణాలు ఈ నాలుగు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి.
తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ విజృంభణ
హరియాణా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోనూ రోజువారీ సరళి కంటే కేసులు ఎక్కువయ్యాయి. ఉత్తరాది, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలన్నింట్లో ఉద్ధృతి పెరిగింది. అన్‌లాక్‌-1 తర్వాత రోజూ సగటున 6,500 యాక్టివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 84.47% కేసులు, 83% రికవరీలు, 92.59% మరణాలు టాప్‌-10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.