close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీబీఎస్‌ఈ సిలబస్‌ 30% తగ్గింపు

ఈ విద్యాసంవత్సరానికి 9-12 తరగతులకు వర్తింపు

ఈనాడు, దిల్లీ: కరోనా కారణంగా పాఠశాలలు నడవని పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను 30%మేర తగ్గించింది. విద్యార్థుల అభ్యాస లక్ష్యాల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన అంశాలను యథాతథంగా ఉంచుతూనే 9-12 తరగతుల సిలబస్‌ను 30%వరకు హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. మరోవైపు, తగ్గించిన అంశాలు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌, సంవత్సరం చివరలో నిర్వహించే బోర్డు పరీక్షల్లో రావని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అనుసరించాలని సూచించింది. సవరించిన సిలబస్‌ గురించి http://cbseacademic.nic.inలో తెలుసుకోవచ్చు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.