close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.657 కోట్లతో గ్రామీణ రహదారులు

 1120 కిలోమీటర్ల మేర నిర్మాణం
 కేంద్రం వాటా రూ.386 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 1119.94 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. దీనికి రూ.657 కోట్ల నిధులు వ్యయం కానున్నాయి. నియోజకవర్గాల వారీగా చేయాల్సిన పనులకు సంబంధించి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రతిపాదనలు పంపగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వాటిని పూర్తిచేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద కేంద్రం రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. శాసనసభ నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ, ఎన్ని కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలో పరిశీలించి అంచనాలు రూపొందించారు. గతంలోనే వాటికి ఆమోదం రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిధులను మంజూరు చేసింది. మొత్తం 1119.94 కిలోమీటర్ల మేర 152 రహదారులను నిర్మించనున్నారు. ఇందుకయ్యే వ్యయంలో కేంద్రం వాటా రూ.386 కోట్లు కాగా రాష్ట్రం వాటా రూ.271 కోట్లు. వీటికి సంబంధించి త్వరలో పరిపాలనా అనుమతులు పూర్తిచేసి పనులు చేపట్టబోతున్నారు. రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సిద్దిపేట జిల్లా పరిధిలో రాజీవ్‌ రహదారిలోని నాంచార్‌పల్లి స్టేజ్‌ నుంచి తోర్నాల్‌, వెల్కటూర్‌, కోనాల్‌పల్లి, నెర్మెట్ట, నాన్గనూర్‌, ఘన్‌పూర్‌ల మీదుగా కొండంరాజ్‌పల్లి వరకూ ఉన్న 31.74 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అత్యధికంగా రూ.233 కోట్లు మంజూరు చేశారు. కేంద్రం అనుమతించిన రహదారుల్లో ఇదే పెద్దది. మిగతా వాటిలో 90 శాతం 10 కిలోమీటర్ల లోపువే. వ్యయం కూడా సగటున ఒక్కో రహదారికి రూ.3కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అవుతుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.