close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకే ఆకాంక్ష.. మహా దీక్ష

200వ రోజున అమరావతి రైతుల వినూత్న నిరసన
గల్లీ నుంచి దిల్లీ వరకు సంఘీభావాల వెల్లువ

ఈనాడు, అమరావతి: ‘‘నవ్యాంధ్రకు మహారాజధాని నిర్మిస్తామంటే ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్న భూములను స్వచ్ఛందంగా ఇచ్చాం. భావితరాలు బాగు పడతాయనే ఆశతో తరతరాల బంధాన్నీ వదులుకునేందుకు సిద్ధపడ్డాం. అనూహ్యంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, మా త్యాగాలను తుంచేస్తూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదు’’ అంటూ అమరావతి రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఉద్యమబాట పట్టారు.
ఎన్ని అవాంతరాలు వచ్చినా మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నారు. వారి పోరాటం శనివారం నాటికి 200 రోజులకు చేరింది. ఈ సందర్భంగా తుళ్లూరు నుంచి షికాగో వరకు జై అమరావతి నినాదం మిన్నంటింది. గల్లీ నుంచి దిల్లీ వరకు రాజధాని రైతుల గుండె ఘోష వినిపించింది. వివిధ పక్షాల వారు నాలుగు అంచెల్లో ఈ నిరసనలు, దీక్షలను చేపట్టారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు... సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు... రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాలు... వివిధ దేశాల్లో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న నగరాల్లో ఇవి కొనసాగాయి. ఆయా దీక్షలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక, సామాజిక వేత్తలు, పలు రంగాల ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
* అమరావతి రైతులు, రైతు కూలీల ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి ‘జూమ్‌ యాప్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించిన నిరసనలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు పాల్గొన్నారు.
*  తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళగిరి సమీపంలోని పార్టీ జాతీయ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాలు, 302 మండల కేంద్రాలు, 620 గ్రామాల్లో దీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 14,179 మంది పాల్గొన్నారు.
*  రాజధాని రైతులను ఉద్దేశించి చంద్రబాబు, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు దేవవ్రత బిశ్వాస్‌, అఖిలభారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, భాజపా నాయకులు సుజనా చౌదరి, పురంధేశ్వరితో సహా 42 మంది ప్రసంగించారు.
*  పోరాటానికి మద్దతుగా ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ రూపొందించిన వీడియో గీతాన్ని ప్రదర్శించారు.
*  అమెరికా సహా వివిధ దేశాల్లోని 300 నగరాల్లోని ప్రవాసాంధ్రులు రాజధాని రైతులకు సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికాలోని 250 నగరాల్లో, ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌ తదితర దేశాల్లోనూ కార్యక్రమాలు జరిగాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.