close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ టీకా ఈ ఏడాది సాధ్యం కాదు

సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్ర

హైదరాబాద్‌: కొవిడ్‌-19కు వచ్చే ఏడాది ఆరంభంలోగా టీకా సిద్ధమయ్యే అవకాశం లేదని స్థానిక ‘సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ’ (సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్ర చెప్పారు. ఈ మహమ్మారికి ప్రపంచంలోనే తొలి టీకాను వచ్చే నెల 15 కల్లా ఆవిష్కరించాలనుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సంబంధిత ఆసుపత్రులకు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లినికల్‌ పరీక్షల నిర్వహణ విషయంలో సంబంధిత ఆసుపత్రులపై ఒత్తిడి తీసుకురావడానికే ఐసీఎంఆర్‌ దాన్ని రాసి ఉంటుందని తెలిపారు. అంతా అనుకున్నట్లే జరిగితే టీకా సిద్ధం కావడానికి 6-8 నెలల సమయం పడుతుందన్నారు. ఒక వ్యక్తికి వ్యాక్సిన్‌ ఇచ్చి, నయమైందా లేదా అని పరీక్షించే ఔషధం లాంటిది కాదు ఇది అని పేర్కొన్నారు. తాము నిత్యం 400-500 కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, దీని సంఖ్యను మరింతగా పెంచడానికి వీలుగా సురక్షితమైన ఒక కొత్త విధానాన్ని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించామన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే పరీక్ష ఫలితాన్ని పొందొచ్చని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.