
ప్రధానాంశాలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నియంత, అవినీతి, అక్రమాల పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆ పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని స్పష్టంచేశారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘రక్తం ఇవ్వండి.. మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాను’ అని స్వాతంత్య్ర ఉద్యమ సందర్భంగా నేతాజీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం యువకులు రక్తాన్ని చిందించారని, ఆ రక్తపు మడుగులో నేడు నియంతలు రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం యువకుల రక్తం అవసరం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించేందుకు సమయం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- ప్రేమోన్మాది ఘాతుకం