close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దేశానికి ఒక రాజధానే ఎందుకు?

నాలుగు ఉండాలి: మమత

కోల్‌కతా: దేశానికి ఒక రాజధాని ఎందుకు ఉండాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. సువిశాల భారతాన్ని పరిపాలించడానికి నాలుగు రాజధానులు ఉండాలని డిమాండ్‌ చేశారు. ‘‘బ్రిటిష్‌ హయాంలో కోల్‌కతా రాజధానిగా ఉండేది. రొటేషన్‌ పద్ధతిలో భారత్‌కు నాలుగు రాజధానులు ఉండాలి. ఒకటే రాజధాని ఎందుకు? దక్షిణాదిన ఒకటి, ఉత్తరాదిన ఒకటి, తూర్పునొకటి ఈశాన్య ప్రాంతాల్లో ఒకటి ఉండాలి. పార్లమెంట్‌ సమావేశాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగాలి. ప్రస్తుత విధానాన్ని మార్చాలి ’’ అని మమత పేర్కొన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా శనివారం మమత 6 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు