close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరు

ఏఐకేఎస్‌సీసీ జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ స్పష్టంచేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలోని పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణన్‌ మాట్లాడుతూ.. పంటలకు కనీస మద్దతు ధరలు అమలుచేసి, రుణ విమోచన చట్టం తేవాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్‌ మాట్లాడుతూ, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా కేంద్రం చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ, ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా వాహనాల ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌ బోస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహన్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ, ఆల్‌ ఇండియా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెచ్చల రంగయ్య, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ విసా కిరణ్‌, తెరాస కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్‌ పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు