close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమస్యలు వీడి దేవాలయ నిర్మాణాలేంటి?

ఎస్సీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: ‘మేం రాముని గుడికి చందాలు ఇవ్వలేం.. మేం చందాలు ఇవ్వాలంటే మీరు అంబేడ్కర్‌ విగ్రహం నిర్మించడానికి చందాలివ్వాలి. అలా ఇస్తారా? అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని ఒప్పుకొంటారా?’ అంటూ చందాల కోసం వచ్చే వారిని ప్రశ్నించాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి వ్యాఖ్యానించారు. రాముడు నేపాల్‌లో పుట్టాడని ఆ దేశ ప్రధాని అన్నారని, ఇక్కడి కొంతమంది మాత్రం మన దేశంలో పుట్టినట్లు చూపిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో జైశ్రీరామ్‌, జైభీమ్‌ రెండే ఉంటాయన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన ‘రాజ్యాంగ రక్షణ సదస్సు’లో ఆయన మాట్లాడారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు రాముడిపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఎస్సీ, బీసీల రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో మాట్లాడకుండా కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. దేశంలోని అన్ని సమస్యలను వదిలేసి దేవాలయాల నిర్మాణాలపై దృష్టి పెట్టారని ఆరోపించారు. దేవాలయాలను పూజారులు చూసుకుంటారని రాజకీయ నాయకులు బడులు, ఆసుపత్రులు, ప్రజల అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. భవిష్యత్తులో ఇక్కడా అలా చేయాలని కొందరు చూస్తున్నారు. హిందు, ముస్లింల మధ్య మత ఘర్షణలు పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు