close

ప్రధానాంశాలు

కామాంధులకు కఠిన శిక్షలు

కన్నబిడ్డనే కాటేసిన తండ్రికి యావజ్జీవం
మరో నాన్నకు ఐదేళ్ల కారాగారం
సిద్దిపేట జిల్లాలోని వేర్వేరు కేసుల్లో తీర్పులు

సిద్దిపేట టౌన్‌, సంగారెడ్డి అర్బన్‌, బెజ్జంకి, న్యూస్‌టుడే: బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే నీతి తప్పారు. కాలనాగులై కాటేశారు. సభ్య సమాజం తలదించుకునే ప్రవర్తించారు. అలా వేర్వేరు నేరాల్లో కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు తండ్రులకు, బాలికపై అఘాయిత్యానికి యత్నించిన మరో యువకుడికి కఠిన శిక్షలు ఖరారు చేస్తూ సిద్దిపేట జిల్లా న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చారు. తద్వారా ఆ తరహా నేరాలకు పాల్పడే తలంపు ఉన్న వారికి హెచ్చరిక జారీ చేశారు. సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌డేవిస్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

* సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూరు గ్రామానికి చెందిన వ్యక్తి (40) మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న కుమార్తె(15)పై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి 2018 అక్టోబరు 12న బేగంపేట పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సంగారెడ్డిలో మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణ జరిగింది. నేరస్థుడికి యావజ్జీవ కారాగారం, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తీర్పు వెలువరించారు.

* మద్దూరు మండలం గాగిల్లాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి(40) ఈ ఏడాది ఏప్రిల్‌ 8న కుటుంబంతో సహా సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం ఒంటరిగా నిద్రిస్తున్న రెండో కుమార్తె(15)ను  బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అడ్డగించిన భార్యను, కుమార్తెను కర్రతో కొట్టి గాయపరిచాడు. నిందితుడిపై ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదైంది. సంగారెడ్డి రెండో అదనపు జిల్లా (ఫాస్ట్‌ట్రాక్‌), స్పెషల్‌ కోర్టులో విచారణ కొనసాగింది. నేరస్థుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్యామ్‌శ్రీ తీర్పు వెలువరించారు.


యువకుడికి మూడేళ్ల జైలు

బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన పుట్ల ఆనంద్‌ (20) ఆగస్టు 17, 2017న అదే గ్రామానికి మహిళ ఇంట్లో చొరబడ్డాడు. ఆమెపై దాడి చేసి, కుమార్తె(13)ను అపహరించాడు. ఘటనపై బెజ్జంకి ఠాణాలో పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్‌ నాలుగో అదనపు జిల్లా (ఫాస్ట్‌ట్రాక్‌), స్పెషల్‌ కోర్టులో విచారణ జరిగింది. ఆనంద్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,700 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాధవీకృష్ణ తీర్పు వెలువరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.