close
రాజన్నకే మస్కా

హుండీ కానుకల అపహరణ
ఇద్దరి చేతులు మారిన సొత్తు
వ్యాపారుల ఫిర్యాదుతో వెలుగులోకి

వేములవాడ, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామికి చెందిన వెండి, బంగారు కానుకలు దొంగతనానికి గురయ్యాయి. నిందితుడు ఆ కానుకలను విక్రయించే ప్రయత్నం చేయగా.. వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆగంతకుడు చోరీ చేసి దాచిన ఈ ఆభరణాలను ఫిరోజ్‌ అనే మరో వ్యక్తి దొంగిలించి విక్రయించే యత్నం చేశాడని పోలీసులు తెలిపారు.

గత నెల 23న రాజన్న ఆలయంలో హుండీలు లెక్కించారు. ఉద్యోగులు, సిబ్బంది, సేవాసంఘాల సభ్యులు పాల్గొన్నారు. లెక్కింపులో పాల్గొన్న గుర్తుతెలియని వ్యక్తి వెండి, బంగారు వస్తువులను దొంగిలించి ఓ సంచిలో దాచి వాటిపైన ఖాళీసంచులు పెట్టాడు. కరీంనగర్‌కు చెందిన ఫిరోజ్‌ ఈ ఆలయంలో ఖాళీసంచులను పోగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత నెల 25న ఆలయంలో సేకరించిన బియ్యాన్ని తరలించేందుకు ఖాళీసంచుల కోసం వెదుకుతుండగా.. ఓ మూలన సంచుల కింద కానుకలతో ఉన్న ఈ సంచిని గుర్తించి, కరీంనగర్‌కు తరలించాడు. వాటిని విక్రయించే ప్రయత్నం చేయగా వ్యాపారులు పోలీసులకు ఉప్పందించారు. వారు ఫిరోజ్‌ ఇంట్లో కానుకలను స్వాధీనం చేసుకొని, నిందితుడిని వేములవాడ పోలీసులకు అప్పగించారు. కానుకల విలువను లెక్కిస్తున్నామని, లెక్కింపు సమయంలో దొంగిలించిన నిందితుడిని గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పట్టణ సీఐ వెంకటస్వామి తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయలేదు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.