
బీడీ కార్మికుల అగచాట్లు
పీఎఫ్ సొమ్ము ఉపసంహరణకూ ఇబ్బందులే
జనన తేదీలు తప్పుగా నమోదవడంతో ఇక్కట్లు
కంపెనీలు చేసిన తప్పిదం.. కార్మికులకు శాపం
ఈనాడు, నిజామాబాద్: తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నిత్యం శ్రమించే బీడీ కార్మికులు తమ జీతం నుంచి జమ చేసిన పీఎఫ్.. వృత్తి విరమణ అనంతరం పొందాల్సిన పింఛను అందక అష్టకష్టాలు పడుతున్నారు. పీఎఫ్ ఖాతాలు తెరిచే సందర్భంలో కంపెనీల యాజమాన్యాలు చేసిన తప్పిదాలు వీరిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో 12 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో పీఎఫ్ ఖాతాలున్న వారు 5.30- 6 లక్షల మధ్య ఉన్నారు. 2014లోపు పీఎఫ్ ఖాతాలున్న వారికి రాష్ట్రప్రభుత్వం రూ.వెయ్యి జీవనభృతి అందించింది. ఈ లబ్ధి పొందుతున్న వారు 4 లక్షల మంది ఉన్నారు. ఇటీవల ఈ మొత్తాన్ని రూ.2016కి పెంచారు. 2014 తర్వాత పీఎఫ్ ఖాతాలు పొందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరికీ జీవనభృతి వర్తింపచేసే అంశంపై ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోగా.. జీవో వెలువడాల్సి ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 5 లక్షల మంది బీడీలు చుడుతున్నారు. వీరిలో 1.60 లక్షల మందికి పీఎఫ్ ఖాతాలున్నాయి. ఉమ్మడి కరీంనగర్లో 5 లక్షల మందికి పైగా కార్మికులుంటే.. 2014లోపు పీఎఫ్ ఖాతాలు కలిగిన వారు 1.43 లక్షల మంది ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 75 వేల మంది ఉండగా.. భృతి పొందుతున్న వారు 56 వేల మంది మాత్రమే. బీడీ కార్మికుల్లో అత్యధికులు నిరక్షరాస్యులే. వీరు పనిచేసే కంపెనీల యజమానులు పీఎఫ్ ఖాతాలు తెరిచే క్రమంలో ఇష్టారీతిన జనన వివరాలు రాసిచ్చారు. యూఏఎన్ నంబరుపై ఆ తేదీనే ఉండిపోయింది. 2013లో ఆధార్ రావడంతో కార్మికులందరూ అసలైన తేదీలు నమోదు చేయించుకున్నారు. కొందరు పుట్టింటి వద్ద కార్మికులుగా చేరి.. అత్తారింటికి వచ్చాక ఆధార్‌లో నమోదయ్యారు. ఇంటి పేరులో తేడాలతో సమస్య ఎదుర్కొంటున్నారు.
నెలల తరబడి తిప్పుతున్నారు
పీఎఫ్ ఖాతాలో ఇంటి పేరు, పుట్టిన తేదీల్లో తేడాలుంటే ఏడాదిలోపు ప్రాంతీయ కార్యాలయాల్లో సరిచేస్తామని చెబుతున్నా.. నెలల తరబడి తిప్పుతున్నారని కార్మికులు వాపోతున్నారు. పీఎఫ్ డబ్బు తీసుకునే ప్రక్రియ ఇప్పుడు ఆన్లైన్ చేశారు. ఈనేపథ్యంలో అర్హులకు పింఛను అందడంలేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రెండు నెలల కిందట కేంద్ర కార్మిక, సమాచార సాంకేతిక మంత్రులు సంతోష్ గాంగ్వార్, రవిశంకర్ ప్రసాద్‌లను కలిసి పీఎఫ్, పింఛను సమస్యల గురించి విన్నవించారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!