close
మూసీ గడ్డితో ఇంధనం!

బయోటెక్‌ విద్యార్థుల ప్రయోగం
వీరి ఫలితానికి గుర్తింపుగా అమెరికా సదస్సుకు ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: ఖర్చు తక్కువతో కేవలం మూసీ ఒడ్డున పెరిగే పచ్చిగడ్డి నుంచి ఇంధనం తయారు చేశారా నలుగురు విద్యార్థులు. వీరి విజయానికి గుర్తుగా అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. ప్రాజెక్ట్‌ వర్క్‌ కింద చేసిన ఈ పరిశోధనను విద్యార్థులు ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’తో పంచుకున్నారు. హైదరాబాద్‌లోని సిటీ కళాశాలకు చెందిన ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులు కె.సునీత్‌కుమార్‌, అమర్‌సిద్ధిఖీ, జి.అఖిల్‌, ఓ పీజీ కళాశాలకు చెందిన పి.విజయప్రసాద్‌రెడ్డి పోస్టుగ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం నాలుగో సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌ కింద బయో ఇంధనం తయారు చేయాలనుకున్నారు. కానీ ఈ తరహా పరిశోధనలకు పెద్దఎత్తున డబ్బులు కావాలి. సహజ వనరులతో ఖర్చు లేకుండా పరిశోధన చేయాలనే నిర్ణయానికొచ్చారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుధావాణి మార్గదర్శనంలో ‘ప్రొడక్షన్‌ ఆఫ్‌ బయో ఇథనాల్‌ ఫ్రం గ్రాసెస్‌ ఆఫ్‌ తెలంగాణ బై నేచురల్‌ డిగ్రడేషన్‌ మెథడ్‌’ పేరుతో గతేడాది ఆగస్టులో దీనికి శ్రీకారం చుట్టారు. ఫలితం వచ్చాక నివేదికను వివిధ దేశాలకు పంపారు. దాన్ని చూసిన అమెరికా ప్రతినిధులు 2020 జనవరిలో న్యూయార్క్‌లో జరిగే ‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌, బయోటెక్‌, బయోలాజికల్‌’కు రావాల్సిందిగా ఆహ్వానం పంపారు.

ప్రయోగం సాగిందిలా..
మూసీనది ఒడ్డు నుంచి సేకరించిన పచ్చిగడ్డిని ముక్కలుగా మార్చి, నీరు కలిపి ప్రత్యేక పద్ధతిలో ఉడకబెట్టారు. ఆ తర్వాత దాన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చి పులియబెట్టారు. ఇలా 4 నుంచి 7 రోజుల పాటు నాలుగైదు సార్లు ఉడకబెట్టి, పులియబెట్టడంతో గోధుమ రంగులో ద్రవం వచ్చింది. ఆ ద్రవం  సాంద్రత గుర్తించి.. ఇథనాల్‌ వేరు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తుల్లో విరివిగా వాడే ఇథనాల్‌ను ఇలా పచ్చిగడ్డి నుంచి తయారు చేయడం గొప్పవిషయమని సుధావాణి తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.