close
హెచ్‌-4 వీసాల్లో భారతీయులకే 93%

హెచ్‌-1బి వీసాల జారీ పెరిగింది
తిరస్కరణ.. భారతీయ కంపెనీలకే పరిమితం కాదు
రాజ్యసభలో కేంద్ర మంత్రి జైశంకర్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: అమెరికాలో పనిచేసేవారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్‌-4 వీసాల్లో 93% భారతీయులకే దక్కినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో హెచ్‌-1బీ వీసాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘జీవిత భాగస్వామి పనిచేసేందుకు అవకాశం కల్పించే విధానం 2015 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిని మున్ముందు కొనసాగించాలా? వద్దా? అనే దానిపై వివాదం నడుస్తోంది. కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. ఏదో ఒక సమయంలో ఈ విధానాన్ని సమీక్షిస్తామని అమెరికా ప్రభుత్వం సంకేతం ఇచ్చింది’’ అని చెప్పారు. మనదేశానికి చెంది, అతి పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న ఏడు ప్రముఖ సంస్థల్లో దేనినీ హెచ్‌1-బీ వీసాల మంజూరీకి అనర్హమైనదిగా అమెరికా ప్రకటించలేదని చెప్పారు. హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల తిరస్కరణతో పాటు జారీ కూడా పెరిగిందన్నారు. భారత్‌ నుంచి ప్రతిభావంతులు అమెరికాకు వలస వెళ్లడం వల్ల రెండు దేశాలూ ప్రయోజనం పొందాలని చెప్పారు.  గత నాలుగేళ్లలో అమెరికా జారీచేసిన హెచ్‌-1బీ వీసాల్లో 69.9% భారతీయులకే వచ్చినట్లు జైశంకర్‌ తెలిపారు. గత నాలుగేళ్ల గణాంకాలు సభ ముందుంచారు.

 

వివరం  2015       2016     2017     2018
మొత్తం హెచ్‌1-బీ వీసాలు 1,72,748     1,80,057    1,79,049      1,79,660
భారతీయులకు వచ్చినవి        1,19,952  1,26,692  1,29,097      1,25,528
భారతీయుల వాటా%      69.4   70.4     72.1    69.9

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.