
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మహిళా నాయకత్వ అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: మహిళలు స్వశక్తి, నాయకత్వ పటిమతో సాధికారత సాధించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అన్నిరకాల ఒత్తిళ్లను, ఆటంకాలను అధిగమించి పురోగమించాలని చెప్పారు. లింగవివక్షపై సమాజంతోపాటు పురుషుల్లో పరివర్తన రావాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తెలంగాణ జాగృతి, ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రభావిత సంస్థ భారతీయశాఖ (యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ఇండియా) ఆధ్వర్యంలో ‘మహిళా నాయకత్వ అభివృద్ధి, విజయసాధనకు మార్గదర్శనం’ అంశంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో గురువారం ఆమె ప్రారంభించారు. కవిత మాట్లాడుతూ..‘‘మహిళలు అన్నిరంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలి. మిగిలిన మహిళలకు చేయూతనివ్వాలి. ఔత్సాహికులు, ప్రతిభావంతులైన వారు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకురావాలి. ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్న లింగ సమానత్వం, అన్ని స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం, నాయకత్వాలకు ప్రోత్సాహం, కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాలలో మహిళలు ఎదుర్కొనే వివక్షతను రూపుమాపడం ఇప్పుడు మనముందున్న కర్తవ్యం’’ అని కవిత చెప్పారు.
ఐరాస లక్ష్యాలతో శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం అభినందనీయమని యూఎన్జీసీఐ కార్యనిర్వాహక సంచాలకుడు కమల్‌సింగ్ చెప్పారు. తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగతో పాటు మహిళా చైతన్యానికి విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా యూఎన్జీసీఐ ప్రతినిధులు కవితను సన్మానించారు. ఫ్రొఫెసర్ ఆర్.ఆర్.శర్మ, శంకర్ గోయంకా, ఎంసీ తమన్నా, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు, జాగృతి జిల్లా అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు