
అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి
సబ్‌రిజిస్ట్రార్‌పై దాడికి యత్నం
ఆలస్యంగా వెలుగుచూసిన దుశ్చర్య
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్య మరవక ముందే.. గతంలో అక్కడి సబ్‌రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిషేధిత జాబితాలోని భూమి(ప్రభుత్వ భూమి)ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఓ రాజకీయ నాయకుడు పదేపదే ఒత్తిడి తెచ్చాడు. అందుకు అధికారి అంగీకరించకపోవడంతో దాడికి ప్రయత్నించాడు. భయపడిన సదరు అధికారి సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడగా, నచ్చజెప్పి మరో ప్రాంతానికి పంపించారు. మేడ్చల్-మల్కాజ్గిరి, యాద్రాద్రి భువనగిరి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపులు, దాడి యత్నాలు సర్వసాధారణం అయ్యాయి. భూముల ధరలు ఆకాశాన్నంటడం, స్థానిక రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూములను తమ పేరుపై మార్చాలంటూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులపై ఒత్తిడి తేవడం పెచ్చుపెరిగింది. హైదరాబాద్ నగరంలో మరో ఇద్దరు సబ్రిజిస్ట్రార్లకు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. వికారాబాద్ జిల్లాలోనూ ప్రభుత్వ భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ప్రభుత్వ భూములను తమ పేరిట మార్చాలని, లేకపోతే ఎంతకైనా తెగిస్తామని బెదిరింపులు పెరిగిపోతుండటంతో సదరుశాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ప్రతి మండలం నుంచి జాబితా
22/ఏ నిషేధిత జాబితా భూముల వివరాలను రికార్డుల్లో చేర్చడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయమని వచ్చినప్పుడు అవి నిషేధిత భూములని అధికారులను తెలియడం లేదు. ఇలా చాలా వరకు ప్రభుత్వ, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌లో పొరపాట్లు దొర్లుతున్నాయి. ఇదే విషయంపై 2104లో కోర్టు రెవెన్యూ శాఖకు అక్షింతలు వేసినా, పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూముల రక్షణకు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రతి మండలం నుంచి నిషేధిత భూములు అత్యధికంగా ఉన్న 5 గ్రామాల జాబితా ఇప్పటికే అధికారులకు చేరింది. ఇకపై ఈ భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలు, సబ్రిజిస్ట్రార్లకు ఇవ్వాల్సిన అధికారాలపై చర్చించేందుకు ఉన్నతాధికారులు త్వరలోనే సమావేశం కానున్నారు. అది పూర్తయిన వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయని రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సెక్షన్ 22/ఏ నిషేధిత జాబితా అంటే..
ప్రభుత్వ, దేవాదాయ భూములు, రహదార్ల నిర్మాణానికి తీసుకున్న స్థలాలు, అసైన్డ్ భూములన్నీ సెక్షన్ 22/ఏ నిషేధిత జాబితాలోకే వస్తాయి. రెవెన్యూ రికార్డుల్లో భూమి సెక్షన్ 22/ఏ జాబితాలో ఉందంటే దాని అమ్మకం, కొనుగోలు చేసే అధికారం ఎవరికీ ఉండదు. ఆ భూముల క్రయవిక్రయాలు చేసినవారు, సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయి.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి