close
కొలువుల భర్తీకి ప్రకటన

  3,025 విద్యుత్తు పోస్టులకు 3 నోటిఫికేషన్లు
  జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు వయోపరిమితి 35 ఏళ్లు
  జూనియర్‌ అసిస్టెంట్‌కి, జేపీపీకి 34 సంవత్సరాలే
  వయో పరిమితి తగ్గింపుతో నిరుద్యోగుల ఆందోళన
  22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) 3025 పోస్టుల భర్తీకి 3 వేర్వేరు ప్రకటనలను బుధవారం విడుదల చేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌) పోస్టులు 2500, జూనియర్‌ అసిస్టెంటు(జేఏ) కం కంప్యూటర్‌ ఆపరేటర్‌ 500,   జూనియర్‌ పర్సనల్‌ అధికారి(జేపీపీ) 25 పోస్టులకు ఈ ప్రకటనలు జారీచేసింది. గతంలో ఈ పోస్టులకు వయో పరిమితి 44 ఏళ్లుండగా తాజా ప్రకటనల్లో తగ్గించింది. జేఎల్‌కు 35, మిగతా 2 రకాల పోస్టులకు 34ఏళ్ల లోపువారే దరఖాస్తు చేయాలనడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి ఈ 35ఏళ్ల పరిమితి వర్తించదు. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ భర్తీచేస్తున్న పోస్టులకు దరఖాస్తుదారులకు సైతం 44 ఏళ్ల వయో పరిమితి ఉంది. అలాగే వీటికీ వయో పరిమితి పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
* జేఏ పోస్టులకు ఈ నెల 31 నుంచి నవంబరు 20లోగా దరఖాస్తు చేయాలి. డిసెంబరు 22న రాతపరీక్ష ఉంటుంది. మిగతా రెండు రకాల పోస్టులకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10లోగా దరఖాస్తు చేయాలి. వీటికి డిసెంబరు 15న రాతపరీక్షలున్నాయి. టీఎస్‌సదరన్‌పవర్‌.జీఓవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.