
మద్యానికి బానిసైన వ్యక్తికి బందోబస్తు విధులా?
ఈనాడు, సిద్దిపేట: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమది. ఆయన తరచూ వచ్చి కొన్ని రోజుల పాటు గడిపే వ్యవసాయ క్షేత్రమది. కుటుంబసభ్యులతో పాటు ఇతర ప్రముఖులూ వచ్చి వెళుతుంటారు.సాధారణంగా అలాంటి చోట అత్యుత్తమ ప్రతిభ చూపేవారిని, మెరికల్లాంటి వారినే నియమిస్తారు. కానీ మద్యానికి బానిసైన వ్యక్తికి బందోబస్తు బాధ్యతలు ఎలా ఇచ్చారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బుధవారం కార్బైన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మద్యానికి బానిస అయ్యాడని పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు.
13 సార్లు క్రమశిక్షణ చర్యలు
ఒక మహిళను హింసించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో 16.06.2005 నుంచి 03.12.2006 వరకు ఆయనను విధుల నుంచి తొలగించినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నాడని 13 సార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మూడుసార్లు ఇంక్రిమెంట్‌ను వాయిదా వేసినట్లు పేర్కొంది. మద్యపాన వ్యసనం నుంచి బయట పడటానికి 2 నెలలు చికిత్స కూడా తీసుకున్నట్లు వివరిస్తున్నారు. ఈనెల 1 నుంచి వ్యవసాయ క్షేత్రంలో విధుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇవన్నీ నిజమే అయితే అలాంటి వ్యక్తికి బందోబస్తు బాధ్యతలు ఎలా అప్పగించారనే ప్రశ్న తలెత్తుతోంది. పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సినచోట ఇంత నిర్లక్ష్యంగా వ్యహరించిన తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యసనాల బారిన పడిన వ్యక్తికి ఆయుధమిచ్చి, ముఖ్యమంత్రితోపాటు ప్రముఖులు తిరిగే చోట విధులు అప్పగించడాన్ని కొందరు పోలీసులు అధికారులే విమర్శిస్తున్నారు. ఇదే విషయమై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ను ఈనాడు ప్రశ్నించగా ఇక్కడ ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని ప్రత్యేక పోలీసు పటాలం అధికారులే తీసుకుంటారని తెలిపారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే