close
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర

  పూర్తి ఆధారాలతో అయిదుగురు నాయకుల అరెస్టు
  జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వారావు

గద్వాల పట్టణం, న్యూస్‌టుడే: మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉంటూ.. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు లభించినందునే తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ)తోపాటు పలు సంస్థలకు చెందిన అయిదుగురిని అరెస్టు చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వారావు తెలిపారు. బుధవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 5న సాయంత్రం మేలచెర్వు రోడ్డులో గద్వాల పట్టణ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. మల్దకల్‌ మండలం ఎల్కూరుకు చెందిన నాగరాజు అలియాస్‌ నాగన్న పోలీసులను చూసి పరుగు తీశాడన్నారు. ఆయన్ను పట్టుకుని పరిశీలించగా సంచిలో నిషేధత మావోయిస్టు పార్టీకి చెందిన ప్రభుత్వ వ్యతిరేక విప్లవ సాహిత్యం లభించిందన్నారు. టీవీవీ జిల్లా కన్వీనర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో చెప్పాడన్నారు. తనతోపాటు టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు బండారి మద్దిలేటి, రాష్ట్ర కమిటీ సభ్యుడు వైనమోని బలరామ్‌, స్టూడెంట్‌ మార్చ్‌ పత్రిక సంపాదకుడు జగన్‌, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కల శిల్పలు పనిచేస్తున్నట్లు వివరించాడన్నారు. మొత్తం 8 మందిపై గద్వాల పట్టణ ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారన్నారు. ఈనెల 5న నాగన్నను, 7న బలరామ్‌ను, 11న జగన్‌ను అరెస్టు చేశామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మద్దిలేటి, నలమాస కృష్ణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. వారినుంచి విప్లవ సాహిత్యం, ఉత్తర ప్రత్యుత్తరాలు, మొబైల్‌ ఫోన్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ముఖ్యమైన పత్రాలను స్వాధీనంచేసుకున్నట్లు చెప్పారు. వీరంతా టీవీవీ, ప్రజాసంఘాల ముసుగులో గద్వాల కేంద్రంగా పనిచేస్తున్నారని, ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులను సమీకరిస్తూ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. మిగిలిన ముగ్గురిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ కృష్ణ ఉన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.