
ముగ్గురు ఉగ్రవాదుల మృతి
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పజల్పోరాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు మరణించారు. మంగళవారం రాత్రి వారు ఓ ఇంట్లో దాక్కొని ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రత బలగాలు చుట్టుముట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ప్రతిస్పందించగా కాల్పుల్లో ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా ఇరవై ఏళ్లవయసు వారే. మరోవైపు, పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సేఠి కుమార్ సాగర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇటుకల తయారీ నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు.
ఆపిల్ పళ్లపై నినాదాలు
కశ్మీర్ నుంచి వస్తున్న ఆపిళ్లపై ‘మాకు స్వేచ్ఛ కావాలి’. ‘జాకిర్ ముసా తిరిగి రావాలి’ ‘ఐ లవ్ బుర్హన్ వని’, ‘గో బ్యాక్ ఇండియా’, ‘పాకిస్థాన్’ తదితర నినాదాలు ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో రాసి ఉండటంతో వాటిని తీసుకోవటానికి వ్యాపారులు నిరాకరించారు. జమ్ము, కథువా తదితర ప్రాంతాలకు వచ్చిన పెట్టెలను తెరవగానే ఇలాంటి నినాదాలు ఉన్న పళ్లు కనిపించాయి.
సైనిక, వైమానిక స్థావరాల్లో అప్రమత్తం
దిల్లీ: పాకిస్థాన్ నుంచి అనేకమంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారంటూ ఇంటెలిజెన్స్ విభాగం బుధవారం సమాచారం ఇచ్చింది. దీంతో సైనిక, వైమానిక స్థావరాల్లో హైఅలర్ట్ ప్రకటించి అప్రమత్తం చేశారు. పఠాన్‌కోట్, జమ్మూలోని వైమానిక స్థావరాల్లో వాయుసేన ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!