close
ఎల్‌ఆర్‌ఎస్‌

కొత్త పురపాలికలు, నగరపాలికల్లోనే అవకాశం

2018 మార్చి 30లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వాటికే
దరఖాస్తు చేసుకునేందుకు 90 రోజుల గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 73 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల పరిధిలో అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మించిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల పరిధిలోని లేఅవుట్లను కూడా క్రమబద్ధీకరించనుంది. వీటిని హెచ్‌ఎండీయే క్రమబద్ధీకరిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధివిధానాలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. 2018 మార్చి 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న లేఅవుట్లు మాత్రమే పరిగణనలోకి వస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి తొంభై రోజుల గడువులోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ విధివిధానాలివి..
* లేఅవుట్లలో రహదారులు, డ్రైనేజీ పనులు, నీటి సరఫరా వ్యవస్థ, వాననీటి సంరక్షణ ఏర్పాట్లు, వీధి దీపాలు ఏర్పాటై ఉండాలి. ఖాళీ స్థలాలైతే ప్రహారీ లేదా  ఫెన్సింగ్‌ తదితరాలు తప్పకుండా ఉండాలి.
* భూమి మార్కెట్‌  విలువ ఆధారంగా చేసుకుని రుసుం నిర్ణయిస్తారు.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు రూ. 10,000 లేదా మొత్తం రుసుంలో 10 శాతం చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని అధీకృత లేఖ జారీ అనంతరం హెచ్‌ఎండీఏ లేదా డీటీసీపీ (డిస్ట్రిక్ట్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌) విభాగానికి చెల్లించాలి.
* మొత్తం రుసుం చెల్లించాక ఆరు నెలల లోపు క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తారు.
* నివాస స్థలాలు కాని ప్రాంతాలకు నిబంధనల మేరకు అదనపు రుసుం కట్టాలి.
* నాలా పరిధి, శిఖం, నీటి వనరులు, నదీ పరీవాహకాల పరిధిలోని వాటికి, గ్యాస్‌, ఆయిల్‌ పైపు లైన్లు ఉన్న ప్రాంతాల్లోని లేఅవుట్లకు క్రమబద్ధీకరణ ఉండదు.
* ఏదైనా కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురైతే, దరఖాస్తుదారులు అప్పీలేట్‌ అథారిటీకి నివేదించుకునే అవకాశం ఉంటుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.