
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ
ఆర్టీసీ కార్మికుల సమ్మె సమాచారం వారి దృష్టికి!
ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం సాయంత్రం కలిశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలిసారిగా ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో సుమారు అరగంట పాటు సాగిన భేటీల్లో విభిన్న అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి గవర్నర్ వారికి వివరించినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా సాగుతుండటం.. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం... మరో కార్మికుని మరణం.. సమ్మె నేపథ్యంలో పాఠశాలల సెలవుల పొడిగింపు వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియవచ్చింది. ఆర్టీసీ కార్మికులు తనను కలిసి వివరించిన అంశాల గురించీ చర్చించినట్లు సమాచారం. రాజ్‌భవన్‌ను ప్లాసిక్ రహితంగా మార్చడం.. యోగా, రక్తదాన శిబిరం నిర్వహణ గురించి తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల పుస్తకాన్ని గవర్నర్ వారిద్దరికీ అందజేశారు.
ముందుగానే రాక
ప్రధాని, హోం మంత్రులను కలిసేందుకు ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా దిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందింది. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి, హోం మంత్రి ఉండటంతో ప్రచార గడువు ముగిసిన తర్వాతే సమావేశం ఉంటుందని అంతా అనుకున్నారు. ఇందుకు భిన్నంగా ముందుగానే గవర్నర్‌కు సమయం ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులే ఇందుకు కారణమని భావిస్తున్నారు.గవర్నర్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- పెళ్లే సర్వం, స్వర్గం